Wednesday 19 July 2017

రూ.999కే నోకియా కొత్త ఫోన్





https://telugu.gizbot.com/
రూ.6999కే మైక్రోమాక్స్ భారీ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్‌
ముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన Canvas లైనప్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Canvas 1 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ధర రూ.6.999. మాటీ బ్లాక్ ఇంకా క్రోమ్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై సంవత్సరం వారంటీతో పాటు 100 రోజుల రీప్లేస్‌మెంట్ స్కీమ్‌ను కూడా మైక్రోమాక్స్ ఆఫర్ చేస్తోంది. అంటే ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల్లోపు ఏదైనా హార్డ్ వేర్ లోపం తలెత్తినట్లయితే ఆ ఫోన్ ను కొత్త ఫోన్‌తో రీప్లేస్ చేస్తారు.
మైక్రోమాక్స్ కాన్వాస్ 1 స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 294 పీపీఐ) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆన్ టాప్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు ( డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో ఫోన్ జాక్), 2,500mAh బ్యాటరీ. ఫోన్‌లోని అదనపు ఫీచర్లు (మల్టీ విండో సపోర్ట్, క్విక్ సెట్టింగ్స్).

==
రూ.999కే నోకియా కొత్త ఫోన్
హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ రెండు సరికొత్త ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. నోకియా 105, నోకియా 130 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. 2015లో మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన నోకియా 105, నోకియా 130 మోడల్స్‌కు ఇవి అప్‌డేటెడ్ మోడల్స్.
రెండు వేరియంట్‌లలో... భారత్‌లో నోకియా 105 రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ.999. డ్యుయల్ సిమ్ వేరియంట్ ధర రూ.1149. జూలై 19 నుంచి ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతుంది.

నోకియా 130 రిలీజ్ డేట్ వెల్లడికావల్సి ఉంది... మార్కెట్లో నోకియా 130 అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఈ రెండు ఫోన్‌లు సిరీస్ 30+ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి.

No comments:

Post a Comment

Customer files case against flipkart

 Here a customer has filed a cheating case against e-commerce retailer Flipkart, who had received fake products (a stone and two toy camera...